కుంభకర్ణుడు వానర సేనతో యుద్ధం చేయుట

రాముడు నీలుడితో వానరసేనను యుద్ధానికి సిద్దం చెయ్యమని చెప్పాడు. గవాక్షుడు, శరభుడూ, హనుమంతుడూ, అంగదుడూ తలా ఒక పర్వత శిఖరమూ పట్టుకుని లంకా ద్వారాలవద్ద నిలబడ్డారు.

ఈలోపల కుంభకర్ణుడు రావణుడి ఇంటికి వెళ్ళి, పుష్పకంలో విచారంగా కూర్చుని ఉన్న తన అన్నను చూశాడు. కుంభకర్ణుణ్ణి చూడగానే రావణుడు సంతోషంతో లేచి వెళ్ళి కౌగలించుకున్నాడు.

కుంభకర్ణుడు అన్నగారి పాదాలకు నమ స్కారం చేసి, “నన్ను నిద్రలేపిన కారణ మేమిటి ? ఏం భయం వచ్చిపడింది? ఎవరికి చావు మూడింది?” అని అడిగాడు.

“నీవు చాలా కాలంగా సుఖ నిద్రలో ముణిగి ఉన్నందున, రాముడు నాకు తెచ్చి పెట్టిన భయం గురించి నీకు తెలీదు. రాముడు సుగ్రీవుడి సేనతో సహా సము ద్రాన్ని దాటి వచ్చి మన అంతు కనుక్కుం టున్నాడు. లంకలో ఉండే వనాలూ, ఉప వనాలూ చూడు, అన్నీ వానర మయం. మన రాక్షస ముఖ్యుల నందరినీ వానరులు చంపేస్తున్నారు, వానర ముఖ్యులు మన చేతిలో చావటం కనబడదు. నువు మహా బలుడివి, ఈ ఆపద నుంచి కాపాడుతావని నిద్రలేపాం,” అని రావణుడు కుంభకర్ణుడితో అన్నాడు.

కుంభకర్ణుడు నవ్వాడు.

“వెనక ఈ విషయం చర్చించుకున్నప్పుడు నీ హితం కోరినవారు ఏ ప్రమాదం వస్తుందని చెప్పారో అదే వచ్చిం దన్నమాట ముందు వెనకలు ఆలోచించుకో కుండా బల గర్వంతో సీతను అపహరించి తెచ్చావు. మన తమ్ముడు విభీషణుడు చెప్పినట్టు చెయ్యి,” అన్నాడు.

రావణు డీ మాటలు విని అలిగి, “నీవు చిన్నవాడివి, నేను పెద్దవాణ్ణి, గౌరవించ దగిన వాణ్ణి. నాకు నీవు బుద్ధులు చెప్పటం వట్టి కంఠ శోష. జరిగిపోయినదాన్ని గురించి ఇప్పుడు చర్చ దేనికి? ప్రస్తుత కర్తవ్యం ఆలోచించు. నేను చేసిన తప్పును నీ శౌర్యంతో సరిదిద్దు,” అన్నాడు..

రావణుడికి కోపం వచ్చిందని గ్రహించి ఈంభకర్ణుడు మృదువుగానూ, ఊరడింపు గానూ ఇలా అన్నాడు: “బాధపడకు! కోప్పడకు! నీకు తమ్ముణ్ణి, హితుణ్ణి కనక నీకు చెప్పవలిసిన మాట చెప్పాను. యుద్ధంలో రామలక్ష్మణులను చంపేసి నీ కోరిక తీరుస్తాను. రాముడి తల తెచ్చి నీ ముందు పెట్టి నిన్ను సంతోష పెడతాను. నేను బతికి ఉండగా నీకు రాముడి భయం ఎందుకుంటుంది? నన్ను యుద్ధానికి పంపించు. నా కసలు ఆయుధాలతో పని లేదు, ఉత్త చేతులతోనే ఎంతటి యోధులనైనా చంపెయ్యగలను.”

కుంభకర్ణుడి ఈ మాటలు విని మహోదరుడు మండిపడ్డాడు..

“నీవు మొరటు మనిషివి, అల్ప బుద్ధి, అహంకారి! రావణుడు చెయ్య గూడని పని ఎందుకు చేస్తాడు ? చెడ్డపని చేసినందు వల్ల దుష్ఫలితం కలిగినట్టు చెప్పావే, అలా అనటానికి ప్రమాణ మేమిటి? మంచి పనుల వల్ల దుఃఖమూ, చెడ్డ పనుల వల్ల సుఖమూ కలగటం లేదా? సీతను అపహరించాలని రావణుడికి కోరిక పుట్టింది. ఆ కోరికను మేముకూడా బలపరిచాం. ఆది అలా ఉంచు. నీ వొక్కడవే యుద్ధానికి పోతానంటున్నావే! జనస్థానంలో అంత మంది రాక్షస వీరులను చంపిన రాముణ్ణి నీ వొక్కడవే చంపగలవా?” అన్నాడు. మహోదరుడు.

తానూ, ద్విజిహ్వుడూ, సంప్రది, కుంభకర్ణుడూ, వివర్ధనుడూ అనే అయిదుగురూ వెళ్ళి రాముణ్ణి చంపాలని మహోదరుడు సూచించాడు. రాముడు చచ్చాడా సరే సరి, ఒకవేళ అతను చావకపోయినా ఈ అయిదు గురూ యుద్ధంలో తిన్న గాయాలతో, రక్త ప్రవాహాలతో తిరిగి వచ్చి, రావణుడితో, “మేము రామలక్ష్మణులను తినేశాం!” అని చెబుతారు. అప్పుడు రావణుడు సీతను ఓదార్చి, ధనకనక వస్తువాహనాలిచ్చి ఆమె మనసును వశ్యం చేసుకుంటాడు. రావణుడు యుద్ధానికి వెళ్ళి రాముణ్ణి ఎదుర్కో పలిసిన పని లేకుండానే సీత అతని పశమవుతుంది! ఇది మహోదరుడు చెప్పిన ఉపాయం.

అంతా విని కుంభకర్ణుడు, ఇలాటి మాటలెన్నడూ చెప్పకు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో!” అని మహోదరుణ్ణు హెచ్చరిం చాడు. అతడివంటి వాళ్ళ సలహాలు వినే రావణుడి కీగతి పట్టిందన్నాడు. యుద్ధం పేరు చెబితేనే భయపడే మహోదరుడి లాటి వాళ్ళు రావణుడు చెప్పినదాని కల్లా తల ఊపుతూ మార్గదర్శకులుగా ఉండటానికి బదులు తోడునీడలుగా తయారైనారన్నాడు.

కుంభకర్ణుడి మాటలకు రావణుడు. గట్టిగా నవ్వి, “మహోదరుడికి రాము ఉంటే భయంలే! అందుచేత యుద్ధానికి పోవద్దంటున్నాడు. నీవు వెళ్ళి యుద్ధం చేసి జయించి రా. వెళ్ళి, రామలక్ష్మణులనూ, వానరులనూ భక్షించు,” అన్నాడు.

కుంభకర్ణుడు ఒక అపూర్వమైన శూలాన్ని తీసుకున్నాడు. అది బోలెడంత ఇనుము ఉపయోగించి చేసినది, బంగారు అలంకారాలు గలది, ఎర్రని పూలమాలి కలు చుట్టినది, ఇంద్రుడి వజ్రాయుధానికి తీసిపోనిది. ఆ శూలం మాత్రం తీసుకుని, తాను ఒక్కడే యుద్ధానికి పోతాననీ, తనకు సహాయంగా సేన అవసరంలేదని కుంభ కర్ణుడు చెప్పాడు.

రావణుడు అతనితో సైన్యాన్ని ఆయు ధాలనూ తీసుకుపొమ్మనీ, యుద్ధంలో ఏమరుపాటుగా ఉన్నవాడికి, ఒంటరిగాడికి ప్రమాదం హెచ్చనీ అన్నాడు. అతను తన తమ్ముడి మెడలో రత్నఖచితమైన బంగారు హారం వేశాడు, అతనికి బాహుపురులూ, ఉంగరాలూ మొదలైన ఆభరణాలు పెట్టాడు, మంచి సువాసన గల పుష్ప మాలలు వేశాడు, చెవులకు కుండలాలు పెట్టాడు, ఎంతో బరువైన బంగారు కవచం తొడిగాడు.

కుంభకర్ణుడు అన్నను కౌగలించుకుని, అతని చుట్టూ ప్రదక్షణం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి యుద్ధానికి బయలు దేరాడు. అతని వెనకగా మహాబలశాలు లైన రాక్షసవీరులూ, పెద్దసేనా ఆయుధాలు ధరించి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరేటప్పుడు కుంభకర్ణుడు తన దేహాన్ని అపారంగా పెంచి ఉండటం వల్ల అతను ప్రాకారాల మీదుగా అంగవేసి దాటి వానరసేనలను చేరబోయాడు. అతన్ని చూసి వానరులు, మహామారుతానికి కొట్టుకు పోయే మబ్బు తునకల్లాగా, అన్ని దిక్కు లకూ చెల్లాచెదరుగా పారిపోయారు.

కుంభకర్ణుణ్ణి చూసి పారిపోతున్న వానర వీరులలో నలుడూ, నీలుడూ, గవాక్షుడూ, కుముదుడూ లాటి వాసర ముఖ్యులున్నారు. అంగదుడు వారిని చూసి, ” మీరు మీ ఆత్మ గౌరవాన్నీ, పరాక్రమాన్ని కూడా మరిచి, చచ్చుకోతుల్లాగా బెదిరిపోయి ఎక్కడి కలా పారిపోతున్నారు? ఆ వచ్చేది యుద్ధం చేసే రాక్షసుడు కాదు, విభీషిక భయం పుట్టించే బొమ్మ. వెనక్కు రండి, ఈ వెరబొమ్మను ధ్వంసం చేద్దాం” అన్నాడు.

అ మాటలతో ధైర్యం తెచ్చుకుని వాన రులు వెనక్కు తిరిగివచ్చి కుంభకర్ణుడిపై తలపడ్డారు. వాళ్ళు తనపై వేసిన కొండ రాళ్ళకూ, చెట్లకూ కుంభకర్ణు డేమాత్రమూ చలించలేదు, పైపెచ్చు కోపం తెచ్చుకుని వానరులను నిర్మూలించ సాగాడు.

ఆ దెబ్బతో వానరులు పరుగులంకించు కున్నారు. వాళ్ళు ఒకరి మీదుగా ఒకరు ఎగురుతూ పారిపోయారు. కొందరు ఆకాశం లోకి ఎగిరారు, కొందరు వెళ్ళి సముద్రంలో పడ్డారు, మరికొందరు సేతువు మీదుగా పారిపోయారు. భల్లూకాలు కొందరు చెట్ల లోనూ, మరికొందరు కొండలలోనూ దాక్కున్నారు, కొందరు చతికిలపడ్డారు, కొందరు మూర్ఛపోయారు, కొందరు చచ్చినట్టు కదలకుండా పడుకున్నారు.

“ఆగండి! ఆగండి! వెనక్కు రండి!” అని అంగదుడు కేక పెట్టి వానరులను పిలిచాడు. యోధులైనవాళ్ళు శత్రువును చంపి కీర్తి గడించటమో, శత్రువు చేతిలో చచ్చి బ్రహ్మలోకానికి పోవటమో చెయ్యాలిగాని, ప్రాణాలు కాపాడుకోవటానికి పిరికిపంద ల్లాగా పారిపోరాదనీ, కుంభకర్ణుడికి రాముడి చేతిలో నిశ్చయంగా చావు మూడిందనీ అతను వానరులతో అన్నాడు. కాని వాళ్ళు, “కుంభకర్ణుడు మమ్మల్ని దారుణంగా చంపేస్తున్నాడు. మేము పోతాం. మాకు ప్రాణాలు దక్కితే చాలు,” అని, కుంభకర్ణుడు వస్తూండటం చూసి పారిపోయారు.

అయితే అలా పారిపోయే వానరులను అంగదుడూ, హనుమంతుడూ కలిసి మంచి మాటలతో నచ్చచెప్పి ఎలాగో వెనక్కు మరలించగలిగారు..

తరువాత హనుమంతుడు పన్నెండు మంది వానరయోధులను వెంటబెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. వారెవరంటే, ఋషభుడూ, శరభుడూ, మైందుడూ, ధూమ్రుడూ, నీలుడూ, కుముదుడూ, సుషేణుడూ, గవాక్షుడూ, రంభుడూ, తారుడూ, ద్వివిదుడూ, పనసుడూనూ.

వీరంతా ఏకంగా చేసిన యుద్ధంలో అనేక మంది రాక్షసులు చచ్చారు, రథాలు- సుగ్గయాయి, ఏనుగులు, గుర్రాలూ, ఒంటెలూ చచ్చాయి. హనుమంతుడు గాలి లోకి ఎగిరి కుంభకర్ణుడి పైన కొండరాళ్ళ వర్షం కురిపించాడు, వృక్షాలు వేశాడు. కుంభకర్ణుడు వాటి నన్నిటినీ తన శూలంతో పక్కకు నెట్టేశాడు. కుంభకర్ణుడు వానరు లను తరుముతూ పోతూంటే హనుమంతుడొక పర్వత శిఖరం పట్టుకుని అతనికి అడ్డంగా నిలబడ్డాడు. దాన్ని పెట్టి హనుమంతుడు కొట్టే సరికి కుంభకర్ణుడికి తలపగిలి, శరీరం రక్తంతో తడిసింది. వెంటనే కుంభకర్ణుడు తన శూలంతో రొమ్ములో పొడిచే సరికి, హనుమంతుడు నోట నెత్తురు కక్కుతూ మూర్ఛపోయాడు.

హనుమంతుడు పడగానే మళ్ళీ పారి పోసాగిన వానరులను నీలుడు నిలవవేసి, కుంభకర్ణుడిపై ఒక పెద్ద కొండరాయి వేశాడు. కుంభకర్ణుడు దాన్ని పిడికిలితో పొడిచి చూర్ణం చేశాడు. అయిదుగురు వానరవీరులు కుంభకర్ణుడిపై కలియబడి రాళ్ళతోనూ, చెట్లతోనూ కొట్టి, కాళ్ళతో, చేతులతో తన్నారు. ఈ తాపులకు కుంభ కర్ణుడు చలించలేదు. అతను ఆ అయిదు గురినీ చంపేశాడు.

అది చూసి అనేక వేలమంది వాసరులు కుంభకర్ణుడి పైన వచ్చి పడ్డారు. కుంభ కర్ణుడు వాళ్ళను పట్టుకుని తినసాగాడు. వానరులలో హాహాకారాలు చెలరేగాయి. వాళ్ళు వెళ్ళి రాముణ్ణి శరణు జొచ్చారు.

అంగదుడు కుంభకర్ణుడి తలపైన పెద్ద కొండరాయి వేసి కొట్టాడు. కుంభకర్ణుడు మండిపడి శూలం విసిరితే అంగదుడు ఉపాయంగా తప్పించుకుని, చప్పున కుంభకర్ణుణ్ణి సమీపించి, రొమ్ముల్లో అదిరేటట్టుగా కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్టు డికి మూర్ఛ వచ్చింది. వెంటనే స్పృహ తెచ్చుకుని కుంభకర్ణుడు అంగదుణ్ణి ఎడమ చేతి పిడికిలితో పొడిచి మూర్చ పోగొట్టి, శూలాన్ని ఎత్తుకుని సుగ్రీవుడి పైకి వెళ్ళాడు.

కుంభకర్ణుడు తన శూలాన్ని గిరగిరా తిప్పి సుగ్రీవుడి పైన విసిరాడు. అంతలో హనుమంతుడు వచ్చి మధ్య దారిలో దాన్ని పట్టుకుని, రెండు చేతులా పట్టి విరిచి పారే శాడు. వెయ్యి బారువలు ఇనుముతో చేసిన ఆ శూలం, హనుమంతుడు తన మోకాలికి పెట్టి విరవగానే పుల్లలాగా విరిగిపోయింది.

శూలం పోయేసరికి కుంభకర్ణుడు కోపించి ఒక రాయి విసిరి సుగ్రీవుణ్ణ మూర్ఛపో గొట్టాడు. మూర్ఛలో ఉన్న సుగ్రీవుణ్ణి కుంభకర్ణుడు పట్టుకుని ఎత్తుకుపోయాడు. సుగ్రీవుణ్ణి కాజేస్తే వానరసేనా, రామలక్ష్మణులూ నిర్వీర్యులయిపోతారని అతని ఉద్దేశం. అతను సుగ్రీవుణ్ణి తీసుకుని లంకకు వెళ్ళి పోయాడు. కుంభకర్ణుణ్ణి ఎదిరించి సుగ్రీవుణ్ణి విడిపించుదామా అని హనుమంతుడొక క్షణంపాటు ఆలోచించి, చివరకు అలా చేయటం అనవసరమని తేల్చుకున్నాడు. ఎందుచేతనంటే, స్పృహ తెలిసిన మరుక్షణం అతను తనను తానే విడిపించుకోగలడు. ఇలా అలోచించి హనుమంతుడు, బెదిరిన వానరులకు ధైర్యం చెబుతూ అక్కడే ఉండిపోయాడు.

లంకా పౌరులు కుంభకర్ణుడిపై చల్లిన సుగంధ జలాలతో సుగ్రీవుడికి స్పృహ వచ్చింది. తానిప్పుడు ఏవిధమైన ప్రతిక్రియ చేస్తే బాగుంటుందా అని అతను ఆలో చించాడు. చివర కతను తన గోళ్ళతో కుంభకర్ణుడి చెవులు గిల్లి, ముక్కూ, చెంపలూ కొరికేశాడు. కుంభకర్ణుడు అలిగి సుగ్రీవుణ్ణి నేలకేసి కొట్టి, తొక్కాడు. అయినా సుగ్రీవుడు లక్ష్యపెట్టక వాయువేగంతో గాలి లోకి లేచి రాముడున్న చోట వాలాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *