సీతారామ లక్ష్మణులు చిత్రకూట పర్వతానికి వెళ్ళుట

సీతా రామ లక్ష్మణులు యమునా సంగమమైన ప్రయాగ కేసి . నడిచారు. అక్కడ భరద్వాజ ముని ఆశ్రమం ఉన్నది. వారు ఆశ్రమం చేరేసరికి సూర్యాస్త మయమయింది. రాముడు భరద్వాజుడీ తో క్లుప్తంగా తన కథ చెప్పుకున్నాడు. ఆ “అవును, నీ తండ్రి నిన్ను ఆకారణంగా అడవులకు పంపాడని విన్నాను. నీ విక్కడికి వచ్చావు గనక నిన్ను చూడగలిగాను. ఈ ఆశ్రమంలోనే ఒక పర్ణశాల వేసుకుని పధ్నాలుగేళ్ళూ ఇక్కడే ఉండిపోవచ్చు. ఇక్కడ నీకు సుఖంగా ఉంటుంది, ఈ ప్రదేశంకూడా చాలా పవిత్రమైనది” అన్నాడు భరద్వాజుడు.

దానికి రాముడు, “మునీంద్రా, మేమీ ఆశ్రమంలో ఉన్నామని తెలిస్తే మా ప్రజలు నన్ను చూసి పోవటానికి సులువుగా వస్తూ పోతూ ఉంటారు. అందుచేత ఇంకా దూరంగా, మాకు నివాసయోగ్యమైన ప్రదేశం ఉంటే చెప్పండి. సీత తండ్రి ఇంట ఎంతో సుఖంగా పెరిగినది. ఆమెకు చూడ ముచ్చటగా ఉండే చోటు చెప్పారంటే, అక్కడే. ఆశ్రమం నిర్మించుకుని ఉండి పోతాము” అన్నాడు.

“ఇక్కడ ఉండటం ఇష్టం లేక పోతే ఇక్కడికి పదికోసుల దూరాన చిత్రకూట మనే కొండ ఉన్నది. అది చాలా రమ్య మైన ప్రదేశం. ఆ పర్వతం మీద కొండ ముచ్చులూ, కోతులు, ఎలుగుబంట్లు ఉంటాయి. కొన్ని వేల ఏళ్ళుగా ఋషులు అక్కడ తపస్సు” చేసుకుంటున్నారు. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకోవచ్చు” అన్నాడు భరద్వాజుడు.

ఆ రాత్రి వారు ముగ్గురు భరద్వాజుడు చెప్పిన కథలు అనేకం విని నిద్ర పోయారు. మర్నాడు ఉదయం భరద్వాజుడు వారిని కొంతదూరం సాగనంపి, చిత్రకూటానికి తాను అనేక మార్లు వెళ్ళి వచ్చిన తోవ గుర్తులు చెప్పాడు.

సీతారామ లక్ష్మణులు ఆయన వద్ద సెలవు పుచ్చుకుని ఆయన చెప్పిన దారినే నడుస్తూ యమునా నదిని దాటవలసిన రేవు వద్దకు వచ్చారు. అక్కడ లక్ష్మణుడు కొయ్యల మీద ఎండిన వెదుళ్ళతో ఒక విశాలమైన తెప్ప తయారు చేశాడు. దానిపైన నేరేడు కొమ్మలరోనూ, పట్పలి తీగలకోనూ ఒక సుఖమైన ఆననం సీత కోసం అమర్చాడు.

తెప్ప మీద తమ వస్తువుల నన్నిటిని ఉంచి తాము కూడ ఏక్కీ నదిని దాటారు. వసంత కాలం కావటంచేత అడివి చెట్లు పుష్పంచ మహాశోభగా ఉన్నాయి. మోదుగు చెట్లనిండా ఎర్రటి పూలున్నాయి. సీత ఇప్పుడు ఆ వసంత శోభను చూసి ఆనం దించటం ప్రారంభించింది. “లక్ష్మణుడు ఆమె ముందు నడుస్తూ, ఆమె కోరిన ప్రతి పువ్వూ. ప్రతి పండూ కొని తెచ్చి ఇస్తూ, ఆమె చెట్లను గురించి అడిగే ప్రశ్నలన్నిటికి సమాధానాలిచ్చారు.

ఆ రాత్రి ఒక చదునైన చోటు చూసుకుని అక్కడ నిద్రపోయారు. తెల్లవారుతూనే రాముడు లేచి చిత్రకూటానికి ప్రయాణం సాగిం చాడు. చిత్రకూట ప్రాంతంలో రాముడు ఒక స్థలం చూసి అక్కడ పర్ణశాల నిర్మిద్దమన్నాడు మన్నాడు.

లక్ష్మణుడు మంచి గుంజలు నరికి తెచ్చి వాటితో దృఢమైన పర్ణశాలకి కవలాసిన అవసరమైన విభాగాలూ నిర్మించాడు. ఆ పర్ణశాలలో సీతారామలక్ష్మణులు శాస్త్రకంగా గృహప్రవేశం చేసి, పక్కనే ప్రవహించే మాల్యావతీ నదిలో స్నానాలు చేస్తూ, చుట్టూ ఉండే అందమైన అరణ్య ప్రాంతంలో విహరిస్తూ, పట్టణ జీవితాన్ని మరిచి సుఖంగా కాలం గడపసాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *