గుహుడు సీతారామ లక్ష్మణులకు ఆతిద్యం ఇచ్చుట

గంగా నది సమీపాన శృంగిబేర పురమనే చోట సుమంత్రుడు ఒక పెద్ద గార చెట్టు కింద రథాన్ని నిలిపి, గుర్రాలను విప్పి, వాటికి మేత పెట్టాడు. సీతా రామ లక్ష్మణులు చెట్టు కింద కూచున్నారు. ఈ ఇంతలో గుహుడనే బోయరాజు, రాముడికి మంచి స్నేహితుడు, రాముడి రాక గురించి తెలిసి, తన మంత్రులతోనూ, కుల పెద్దలతోనూ చూడ వచ్చాడు. అతన్ని దూరాన చూస్తూనే రాముడు లక్ష్మణుడితో కూడా ఎదురు వెళ్ళి, గుహుఱ్ఱ ఆలింగనం చేసుకున్నాడు. గుహుడు విచారంతో, “రామా, ఇదే అయోధ్య అనుకో ! నీవు అతిథిగా రావటం నా అదృష్టం,” అన్నాడు.

తరవాత గుహుడు రాముడికీ, లక్ష్మణు డికీ, సీతకూ మంచి భోజనం సిద్ధంచేయించి, “రామా, నీకు ఏ లోపమూ జరగదు. ఈ రాజ్యాన్ని నీవే ఏలుతూ ఉండిపో,” అన్నాడు. రాముడు అతన్ని గాఢంగా ఆలిం గనం చేసుకుని, “గుహా, నా కోసం కాలి నడకన వచ్చావు. అంతకన్న ఇంకేం కావాలి? నీ రాజ్యం నీవే ఏలుకో. నేను నారబట్టలు ధరించి అరణ్యవాసం చెయ్యక తప్పదు.” అని నచ్చచెప్పాడు.

ఆ రాత్రి రాముడూ, సీతా ఆ గార చెట్టు కిందనే పడుకుని నిద్రపోయారు. వా

రికి రక్షగా మేలుకుని ఉన్న లక్ష్మణుడితో గుహుడు, “నాయనా, నీవుకూడా పడుకుని విశ్రాంతి తీసుకో. తెల్లవార్లూ మీకు మేము కాపు ఉంటాంలే, అరణ్యంలో ఉండే మాకిది పరిపాటే,” అన్నాడు. కాని లక్ష్మ’ ణుడు అలా చెయ్యక గుహుడితో తెల్లవార్లూ మేలుకుని కూచుని, జరిగినదాన్ని గురించి, జరగబోయేదాన్ని గురించి మాట్లాడాడు.

అంతా విని గుహుడు చాలా దిగులు పడ్డాడు. ఆ రాత్రి గడిచి మర్నాడు ఉదయము రాముడు కోయిల కూతలకూ, నెమళ్ళ కూతలకూ మేల్కొన్నాడు. అతను లక్ష్మణు డితో, “సూర్యోదయం అవుతున్నది. మనం గంగానది దాటి వెళ్ళిపోదాం,” . అన్నాడు. లక్ష్మణుడు వెళ్ళి బోయ రాజైన గుహుళ్లు సారథి అయిన సుమంత్రుణ్ణి పిలుచుకు వచ్చాడు. రాముడు గుహుడితో తాము గంగానది దాటాలని చెప్పాడు. గుహుడు తన మనుషులను పంపి గంగ దాటటానికి మంచి పడవనూ, నావికుజ్జీ సిద్ధంచెయ్యమన్నాడు.

“రాముడు సుమంత్రుడితో, “సారధీ, నీవిక నగరానికి తిరిగి వెళ్ళు. మా తండ్రి గారితోనూ, తల్లులతోనూ మా క్షేమం గురించి తెలిపి, పధ్నాలుగేళ్ళూ తీరగానే తిరిగి వస్తామని చెప్పు. తరవాత భరతుణ్ణ మేనమామ ఇంటి నుంచి తీసుకు వచ్చి రాజ్యాభిషేకం చేయించు” అన్నాడు.

సుమంత్రుడు, “రామా, రణరంగంలో యోధుడు పడిపోగా సారధి ఉత్త రధాన్ని తీసుకుపోయినట్టుగా, మీరు ముగ్గురూ ఎక్కివచ్చిన రథాన్ని ఖాళీగా అయోధ్యకు తీసుకుపోతే ప్రజల గుండెలు పగలవా? ఉత్త రథంతో తిరిగి వెళ్ళి మీ తల్లులకు , నా మొహం ఎలా చూపించను ? నేనుకూడా ఈ పధ్నాలుగేళ్ళూ మీ వెంటనే వస్తాను” అన్నాడు. “అలా కాదు, సారధీ. నీవిక్కడే ఉండి పోతే మేము అరణ్యానికి వెళ్ళినట్టు కైకేయికీ, తమ ఆజ్ఞ పాలించినట్టు తండ్రిగారికీ ఎలా తెలుస్తుంది? కనక, నీవు తిరిగి వెళ్ళి తీరాలి,” అన్నాడు రాముడు.

ఆ తరవాత రాముడి కోరిక పై గుహుడు మర్రిపాలు తెచ్చాడు. దానితో రామలక్ష్మణు లిద్దరూ మునులలాగా జడలు కట్టుకున్నారు. లక్ష్మణుడు సీతను ముందుగా పడవలోకి ఎక్కించి తరవాత తానుకూడా ఎక్కాడు. రాముడు గుహుడికి వీడ్కోలు చెప్పి ఆఖరున పడవలో ఎక్కి కూచున్నాడు. గుహుడి బంధువులు తెడ్లు వేసి పడవను గంగకు అడ్డంగా నడిపారు. పడవ నడి ప్రవాహంలో ఉండగా సీత గంగకు నమస్కరించి, “గంగాదేవీ, పధ్నాలుగేళ్ళ అనంతరం మేము క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు బ్రాహ్మణులకు లక్ష గోవులూ, వస్త్రాలు దానం చేస్తాను, అన్నదానం చేస్తాను. నీకు వెయ్యి కుండల మద్యమూ నైవేద్యం పెడతాను. నీ గట్టున ఉండే అన్ని దేవాలయాలకూ మొక్కుతాను. మేము సుఖంగా తిరిగి వచ్చేటట్టు అనుగ్రహించు,” అని దణ్ణం పెట్టుకున్నది.

త్వరలోనే పడవ గంగ యొక్క దక్షిణపు గట్టు చేరింది. సీతారామలక్ష్మణులు వత్స దేశంలో అడుగు పెట్టి కాలి నడకన బయలు దేరారు. ముందు లక్ష్మణుడూ, అతని వెనక సీతా, సీత వెనకగా రాముడూ ఈ విధంగా వారు నడక సాగించారు. గంగ ఉత్తరపు గట్టున నిలబడి ఉన్న సుమంత్రుడు వారు కనపడకుండా వెళ్ళిన దాకా చూసి కంటతడి పెట్టుకున్నాడు.

ఆ రాత్రి తన స్థితి తలుచుకుని రాముడు వశం తప్పి మాట్లాడసాగాడు. “ఇదే అరణ్యవాసానికి మొదటిరాత్రి. ఇకనుంచీ సుమంత్రుడు కూడా తోడుండడు. నిద్రపోకుండా మేలుకుని ఉండి తానూ, లక్ష్మణుడు సీతను జాగ్రత్తగా కాపాడు కోవాలి. ఇప్పుడు దశరథుడు పుట్టెడు దిగులుతో పడుకుని ఉంటాడు.”

“కైకేయికి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. దుర్మార్గురాలు భరతుడి కోసం ముసలి రాజును చంపెయ్యదు గద!. ధర్మార్థ కామాలలో కామమే బలమైనది లాగుంది. కాకపోతే తన వంటి ఇష్టుడైన కొడుకును ఏ తండ్రి అయినా అడవికి తోలేస్తాడా? భరతుడు హాయిగా, సుఖంగా రాజ్యమేలు తాడుగద!”

“అనలు ఈ కైకేయి దాపరించింది దశరథుడి కీడుకూ తనను అడివికి పంప టానికీనూ! నీచురాలు! అమ్మ ఏ జన్మ లోనో తల్లి కొడుకులకు ఎడబాటు కలిగించి ఉంటుంది. తాను తలుచుకుంటే, ఒక్క అయోధ్య ఏమిటి, భూమండలమంతా జయించ గలడు! తండ్రి మాటకు లోబడి, ధర్మం కోసం పట్టాభిషేకం మాను కున్నాడు గాని!” రాముడికి నిద్ర రాలేదు

అతను కన్నీరు కారుస్తూ ఇదే ధోరణిలో మాట్లాడుకు పోతూ ఉండటం చూసి లక్ష్మణుడు అతన్ని ఊర డించాడు. ఆ మాటలతో రాముడి మనసు కాస్త స్థిమితపడి, వనవాస దీక్ష ఆతనిలో దృఢపడింది. పక్కనే ఒక మర్రిచెట్టు కింద లక్ష్మణుడు’ ఆకులు పరిచి పక్క సిద్ధం చేశాడు. సీతారాములు ఆ రాత్రికి ఆ పక్క పైన పడుకున్నారు. తెల్లవారుతూనే ముగ్గురూ లేచి గంగా యమునా సంగమమైన ప్రయాగ కేసి . నడిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *