పుత్రశోకంతో దశరధుడు మరణించుట

రాముడు వెళ్ళిపోయిన ఆరో రోజు రాత్రి, తన చావు కొన్ని ఘడియలలో ఉన్న దనగా దశరథుడికి తన చిన్ననాటి వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. ఇంకా కౌసల్యను పెళ్ళాడక పూర్వమే దశరథుడు పుత్రశోకంతో మరణించేటట్టు ఒక ముని పల్ల శాపం పొందాడు. అప్పుడాయన కౌసల్యకు ఆ సంఘటన గురించి చెప్పాడు.

ఆ రోజులలో దశరథుడు యవ్వనంలో ఉన్నాడు. ఆయనకు చప్పుడును బట్టి గురి చేసి కొట్టటంలో చాలా నేర్పుండేది. ఈ శబ్దవేదిత్వాన్ని అందరూ మెచ్చుకునేవారు. అందుచేత యువరాజై ఉన్న దశరధుడు తరచూ రాత్రివేళ సరయూ నది తీరానికి వెళ్ళి, అక్కడ వన్య మృగాలు నీరు తాగటానికి వచ్చే రేవు కనిపెట్టి సమీపంలో దాక్కుని, వీటి చప్పుడును బట్టి బాణం వేసి ఏనుగులనూ, సింహాలనూ, ఇతర మృగాలనూ వేటాడుతూ ఉండేవాడు.

ఇలా ఉండగా ఒకసారి వానాకాలంలో రాత్రివేళ దశరథుడు గాఢాంధకారంలో మృగాల కోసం నదీ తీరాన పొంచి కూర్చున్నాడు ఆ సమయంలో నదినీటిలో బుడబుడమని చప్పుడయ్యింది. అడవి ఏనుగు అయిూ ఉంటుందనుకొని దశరధుడు చప్పుడుకు గురిచేసి తీవ్రమైన బాణం ఒకటి వదిలాడు మరుక్షణమే మనిషి ఆక్రోసం వినిపించింది “అయ్యయ్యో తపస్సు చేసుకునే వాళ్ళ మీద ఈ బాణం పడటమేమిటి నేను ఎవరికి అపకారం చేశాను నన్ను చంపిన వాడికి ఏం లభిస్తుంది.”

“ఎవడోగాని, ఒక్క బాణంతో మూడు ప్రాణాలు తీశాడే! నేను పోతే, ముసలి వాళ్ళూ, గుడ్డి వాళ్ళూ అయిన నా తల్లిదండ్రు లెంతకాలం బతుకుతారు? ఎలా బతుకుతారు?” అన్న మాటలు దశరథుడి చెవుల పడ్డాయి.

ఆయన దగ్గరికి వెళ్ళి చూసేసరికి తన బాణం తగిలి ఒక ముని కుమారుడు కొలను ఒడ్డున బాధతో గిలగిల లాడిపోతున్నాడు. అతను నీటిలో ముంచిన పాత్ర పక్కనే పడి ఉంది.

మతిపోయి, చెయ్యి కాలూ ఆడక నిలబడి ఉన్న దశరధుడితో ఆ ముని కుమారుడు “ఎందుకు చేశావి పాడుపని నేనిక్కడ ఉన్నట్టు నా తండ్రికి నీవే వెళ్లి చెప్పు లేకపోతే ఆయనకు తెలిసే మార్గం లేదు తెలిసినా ఆయన రాలేడు దాహంగా ఉన్నదంటే నీరు తీసుకుని పోదామని వచ్చి నీ బాణం వాత పడ్డాను ఈ బాధ భరించలేను ముందు ఈ బాణం లాగి మరి వెళ్ళు” అన్నాడు

కుర్రవాడు బాధపడి పోతున్నాడు బాణం లాగేస్తే చస్తాడేమోనని దశరధుడు మొదట తటపటాయించిన చివరకు ఆ కుర్రవాడి ప్రోద్భలం మీదనే బాణం లాగేశాడు వెంటనే ముని కుమారుడు ప్రాణాలు వదిలాడు తర్వాత దశరధుడు ఆ కుర్రవాడి పాత్రలో నీరు ముంచుకుని అతడు చెప్పిన దారినే అతని తల్లిదండ్రులుండే కుటీరానికి వెళ్ళాడు.

దశరధుడి అడుగుల చప్పుడు విని తన కొడుకే ననుకొని ఆ కుటీరంలో ఉండే వృద్ధుడు “నాయన ఎప్పుడో అనగా మంచినీటి కోసం వెళ్లిన వాడివి ఇంత ఆలస్యం చేసావే లోపలికి రా త్వరగా ఇయ్యి అన్నాడు.” “నేను మీ అబ్బాయిని కాను దశరధుడుని క్షత్రియుణ్ణి” అంటూ తడబాటుతో దశరధుడు తాను చేసిన ఘోరం కాస్త ఆ వృద్ధ దంపతులకు చెప్పేశాడు.

వారి దుఃఖానికి అంతులేదు దశరధుడి సహాయంతో వారిద్దరూ తమ కొడుకు కళేబరం వద్దకు వెళ్లి దాని మీద పడి పెద్ద పెట్టున్న ఏడ్చారు ముసలి ముని దశరధుడితో “మాకున్న ఒక్క కొడుకును అకారణంగా చంపి మాకు తీరని పుత్రశోకం కలిగించావు కనుక నీవు కూడా పుత్ర శోకంతోనే మరణించాలని నిన్ను శపిస్తున్నాను” అన్నాడు.

తరవాత ఆ వృద్ధ దంపతులు తమ కొడుకు చితిలోనే కాలి చనిపోయారు ఎన్నడో జరిగిన ఈ సంఘటన దశరధుడికి ఇప్పుడు తన ఆయువు తీరిపోయే దశలో జ్ఞాపకం వచ్చింది దానిని ఆయన కౌసల్యకు చెప్పాడు.

కౌసల్యతో మాట్లాడుతుండగానే దశరధుడికి చూపు మందగించింది క్రమంగా శ్రవణ శక్తి కూడా పోయింది బుద్ధి వికలమై పోసాగింది ఆయన రామున్ని కేకలు పెడుతూ కైకేయుని తిడుతూ అర్ధరాత్రి వేళ ప్రాణాలు వదిలాడు.

అది రాముడు బయలుదేరి వెళ్లిన ఆరో రోజు అర్ధరాత్రి ఆ సమయానికి అంతఃపుర స్త్రీలందరూ కౌసల్యా సుమిత్రలు సహితం నిద్రపోతున్నారు రాజు మరణించిన సంగతి మర్నాడు తెల్లవారి గాని అంతఃపుర కాంతులకు తెలియలేదు అంతపురంలో శోకాలు సాగినాక పై వారికి జరిగిన సంగతి తెలిసింది త్వరలోనే వశిష్టుడు మొదలైన వారు వచ్చారు.

దశరధుడికి అంత్యక్రియలు జరపటానికి ఆయన కొడుకులలో ఒక్కడైనా దగ్గర లేడు రామలక్ష్మణులు అరణ్యానికి వెళ్లారు భరత శత్రుజ్ఞులు భరతుడి మేనమామ అయిన కెకేయ రాజు ఇంట ఉన్నారు అందుచేత దశరధుడి శరీరాన్ని తైలంలో ఉంచారు.

సిద్ధార్థుడు విజయుడు జయంతుడు అశోకుడు నందనుడు అనే వారిని పిలిచి వశిష్ఠుడు వారితో “మీరు వేగంగగల గుర్రాల పైన కేకేయ రాజు ఉండే రాజాగృహానికి వెళ్ళండి భరతుడితో ఇక్కడ ఒక ముఖ్య కార్యమున్నదని మేము రమ్మన్నామని చెప్పండి మీరు అతనితో రాముడు అడవికి వెళ్ళిన వృత్తాంతం గాని రాజుగారు చనిపోయిన సంగతి గాని చెప్పనే వద్దు” అని చెప్పి భరతుడికి మేలిమి వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి పంపాడు.

వాళ్లు అనేక నదులు పర్వతాలు దాటి దీర్ఘ ప్రయాణం చేసి భరతుడి మేనమామ గారి దేశం చేరి అతని మేనమామకు తాతగారికి కానుకలుగా తెచ్చిన వస్త్రాభరణాలు భరతుడికి అందించి వశిష్ఠుడు చెప్పమన్న మాటలు అదేవిధంగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *