తెలివైన పంపకం

ఒక రైతుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు చురుకైనవాడు. రెండోవాడు కాస్త అమాయకుడు. రైతు చనిపోతూ పెద్దల ఎదుట తన కొడుకులతో, పెద్దవాడు మూడువేల గజాల చుట్టుకొలతగల భూమిని తాను తీసుకుని, మిగిలినది చిన్నవాడికి ఇవ్వాలని, ఈ పంపకం న్యాయాధికారి సమక్షంలో జరగాలని అన్నాడు.

తండ్రి పోయాక పెద్దవాడు వెళ్ళి పొలంచుట్టూ కొలిస్తే, అది మూడువేల గజాలే ఉన్నది. వాడు తమ్ముడితో, “పొలమంతా నాదే. నీకు ఏమీ రాదు,” అన్నాడు.

చిన్నవాడు ఈ మాట విని కంగారుపడి న్యాయాధికారి వద్దకు వెళ్ళి తన తండ్రి అన్నదీ, తన అన్న చెప్పినదీ చెప్పాడు.

న్యాయాధికారి ఆ అన్నదమ్ములను వెంటపెట్టుకుని వెళ్ళి పొలంచుట్టూ కొలిపించి, చుట్టుకొలత మూడువేల గజాలే ఉండటం గమనించాడు. తరవాత ఆయన ఆ భూమిని అడ్డంగానూ నిలువుగానూ విభజించి నాలుగు భాగాలు చేసి, ఒకదాని కొకటి ఎదురుగా ఉండే భాగాలు రెండు పెద్దవాణ్ణి ఎంచుకోమని, మిగిలిన రెండూ చిన్నవాడికి ఇచ్చేశాడు.

“The judge measures the field, then divides it crosswise and lengthwise so that each brother’s share ends up with an equal boundary.”

ఇద్దరి పొలాలూ మూడేసి వేల గజాల చుట్టుకొలత కలిగి ఉన్నాయి!

— దుమ్మూరి అశోక్‌కుమార్‌రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *